WhatsApp
Advertisement

Samantha : ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేయనున్న హీరోయిన్ సమంత

Samantha : ఐక్యరాజ్యసమితి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు మరే ఇతర దేశంతో సమస్య ఉన్నా, ప్రపంచమంతా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలన్నా, ప్రపంచ ఖ్యాతి కోసం, ప్రపంచ మనుగడ కోసం ఏవైనా కార్యక్రమాలు ఉన్నా.. వాటన్నింటికీ ఇది వేదికలా పని చేస్తుంది.

ఇలాంటి సంస్థతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ సమంత పనిచేయనుంది. దానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి అందరికీ తెలిసిందే. ఆ వేధింపులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితితో కలిసి సమంత పని చేయనుంది.

Advertisement

యూఎన్ విమెన్ ఇండియా ద్వారా నిర్వహిస్తున్న నో ఎక్స్‌క్యూజ్ క్యాంపెయిన్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. దానికి సంబంధించి ఓ వీడియోను సమంత షేర్ చేసింది. మహిళలపై ఆన్ లైన్ లో నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్, ఫేక్ న్యూస్ లాంటివి రావడం వల్ల వాళ్లు చాలా ఇబ్బందులు పడతారు. ఆ బాధితురాళ్ల లిస్టులో తాను కూడా ఉన్నానని సమంత వెల్లడించింది. అందుకే ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని తనకు మద్దతు ఇవ్వాలని సమంత కోరింది.

Advertisement