RTC Driver : మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై పోకిరీలు బూతులతో రెచ్చిపోయారు. ఈ ఘటన నర్సంపేటలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్ లో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. అప్పటికే వాళ్లు ఫుల్లుగా తాగి ఉన్నారు. నర్సంపేటకు టికెట్ తీసుకున్నారు. నర్సంపేట వచ్చినా దిగకుండా బస్సులో నిద్రపోతుండటంతో వాళ్లను లేపిన కండక్టర్ పై విరుచుకుపడ్డారు.
నిద్రపోతున్న మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ కండక్టర్ పై బూతుల వర్షం కురిపించారు. నర్సంపేట ఎమ్మెల్యే మా పెదనాన్న అంటూ రెచ్చిపోయారు. డ్రైవర్ సీటు దగ్గరికి వెళ్లి డ్రైవర్ ను కూడా తిట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
