మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన నేడు మంత్రి మండలి సమావేశం జరగనుంది(Telangana cabinet meeting Today). ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలు ఈ అజెండాలో ఉండనున్నట్లు సమాచారం.
ప్రత్యేకంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల తుది రూపురేఖలు, అలాగే రైజింగ్ తెలంగాణ 2047 పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత వివరణాత్మక వివరాలు వెలువడనున్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
