Last rites : మహబూబ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుక్కి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ తండ్రి. బతికి ఉన్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోయాను.. అని బాలరాజ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ లో ఉన్న పత్తి మిల్లులో పని చేస్తున్న బాలరాజ్ కు భార్య, ఇద్దరు కొడుకులు. ఇటీవల పత్తి మిల్లు మూతపడటంతో ఉపాధి పోయింది. ఉన్న కొడుకుల్లో ఒక కొడుకు దివ్యాంగుడు. భర్తకు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో బాలరాజ్ భార్య, చిన్న కొడుకును తీసుకొని పెద్ద కొడుకుని భర్త దగ్గరే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో తన పెద్ద కొడుకును చూసుకోవడం కోసం హోటల్ లో పని చేయడం మొదలు పెట్టాడు. కానీ.. ఇటీవల పెద్ద కొడుకు అయిన 8 ఏళ్ల హరీశ్ కు తీవ్ర అనారోగ్యం రావడంతో ట్రీట్ మెంట్ చేయించేందుకు డబ్బులు కూడా లేకపోవడంతో హరీశ్ ఇటీవల మృతి చెందాడు.
హరీశ్ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు తన దగ్గర రూపాయి కూడా లేకపోవడంతో స్మశానానికి బాడీని తీసుకెళ్లి అక్కడే కూర్చొని 8 గంటల పాటు ఏడుస్తూ కూర్చున్నాడు బాలరాజ్. కొడుకు బతికి ఉన్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. కనీసం చనిపోయాక అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను అని కంటతడి పెట్టాడు.
ఈ విషయం తెలుసుకున్న ఓ ఫౌండేషన్ సభ్యులు అక్కడికి చేరుకొని ఆ బాబుకి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
