Advertisement
Collector Nizamabad

Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!

మన పత్రిక, వెబ్​డెస్క్: Collector Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల (Purchasing Center) నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నవీపేట, రెంజల్ మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

Advertisement

రెంజల్ మండలం వీరన్నగుట్ట కేంద్రంలో ధాన్యాన్ని నిర్దేశిత మిల్లుకు కాకుండా వేరే మిల్లుకు తరలించడం, ట్యాబ్ ఎంట్రీలలో జాప్యం జరగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యవేక్షణలో అలసత్వం వహించిన రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తుఫాన్ వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్, 17 శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement