మన పత్రిక, వెబ్డెస్క్: ఇప్పటివరకు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, లేదా మొబైల్ నెంబర్ లాంటి వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లి, టోకెన్ తీసుకుని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. ఒక్కోసారి రద్దీ కారణంగా రెండు, మూడు రోజులు తిరగాల్సి వచ్చేది.
ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ, నవంబర్ 1 నుంచి ఈ మార్పులన్నీ ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించనుంది. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చేందుకు ఈ ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది.
అయితే, ఫింగర్ ప్రింట్, ఐరిష్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లవలసి ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పులతో పాటు అప్‌డేట్ ఫీజులను కూడా పెంచారు. పేరు, అడ్రస్ వంటి డెమోగ్రాఫిక్ మార్పులకు రూ. 75, బయోమెట్రిక్ మార్పులకు రూ. 125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల లోపు చిన్నారులకు బయోమెట్రిక్ మార్పులకు ఎలాంటి ఫీజు లేదని పేర్కొంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

