ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం కోసం ఈ పరీక్ష తప్పనిసరి అర్హతగా ఉంటుంది.
AP TET 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ( Ap tet 2025 apply online ) అక్టోబర్ 24, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ నవంబర్ 23, 2025 వరకు ఉంది. దరఖాస్తు ఫీజు ₹1000/- ప్రతి పేపర్ కు ఉంటుంది. ఒక అభ్యర్థి రెండు పేపర్లు (Paper I & II) రాయాలనుకుంటే, ప్రతి పేపర్ కు విడిగా ఫీజు చెల్లించాలి.
పరీక్ష తేదీ డిసెంబర్ 10, 2025. రెండు సెషన్లలో నిర్వహిస్తారు – ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు (Paper I), సాయంత్రం 2:30 నుంచి 5:00 వరకు (Paper II). హాల్ టికెట్లు డిసెంబర్ 3న డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అర్హతలు: Paper I (Class I–V) కు 10+2 లేదా సమానమైన విద్యార్హత కలిగి, D.El.Ed / B.El.Ed / D.Ed (Special Education) పూర్తి చేయాలి. సాధారణ వర్గాలకు 50% మార్కులు, రిజర్వ్ కేటగిరీలకు 45% కనీసం ఉండాలి. Paper II (Class VI–VIII) కు B.A / B.Sc / B.Com / B.Li.Sc / B.Ed లేదా సమానమైన విద్యార్హత తో బాటు, సంబంధిత పాఠ్యాంశంలో B.Ed లేదా D.Ed పూర్తి చేయాలి.
పరీక్ష నమూనా ప్రకారం, రెండు పేపర్లూ 150 మార్కులకు, 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు. పేపర్ I లో Child Development and Pedagogy, Language I (Telugu/Urdu), Language II (English), Mathematics, Environmental Studies విభాగాలు ఉంటాయి. Paper II లో Mathematics & Science లేదా Social Studies ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి మొదట మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. OTP ద్వారా వెరిఫికేషన్ తర్వాత, లాగిన్ ఐడి, పాస్వర్డ్ మీ మొబైల్, ఇమెయిల్ కు పంపబడతాయి. తర్వాత విద్యార్హత, ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి, ఆన్‌లైన్ ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఫలితాలు జనవరి 19, 2026 న విడుదల కానున్నాయి. AP TET పాస్ అయితేనే AP DSC 2025 ఉపాధ్యాయ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలు, సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే జారీ చేస్తారు.
Ap tet 2025 notification pdf download
AP TET Syllabus 2025 PDF download
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

