యూత్ లో ఫామిలీ & డీసెంట్ లవ్ స్టోరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ లాస్ట్ ఇయర్ “మనమే” సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. శర్వా హీరోగా నటిస్తున్న తన 36వ సినిమాకి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది.
దీపావళి స్పెషల్ గా శర్వా సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయగా, ఈ సినిమాకి “బైకర్” (Biker) అనే టైటిల్ ఫిక్స్ చేయగా, అభిలాష్ రెడ్డి కంకర ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో శర్వా క్లీన్ షేవ్ తో కూడిన లుక్స్ తో మెప్పిస్తుండగా, బైక్ స్టంట్ చేస్తున్నట్టు పోస్టర్ స్టైలిష్ గా ఉంది.
స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
