AP DA Hike News: ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఒక ముఖ్యమైన అడుగు వేశారు. డీఎ పెంపు ద్వారా ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. ఈ పెంపు నవంబర్ 1 నుండి అమలు చేయాలని ఆదేశించారు. ఈ చెల్లింపు వలన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.160 కోట్ల అదనపు వ్యయం అవుతుంది.
అలాగే, పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చెల్లింపులు రెండు విడతల్లో జరుగుతాయి. రూ.210 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తామని తెలిపారు.
మరో ముఖ్యమైన నిర్ణయం – ఆరోగ్య పరమైన వ్యయాలను స్ట్రీమ్ లైన్ చేయడం. 60 రోజుల్లోగా అన్ని వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేసి, రియల్ టైమ్ లో ఆరోగ్య పరమైన వ్యయాలను స్ట్రీమ్ లైన్ చేస్తామని తెలిపారు.
చైల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కూడా అభివృద్ధి చేస్తున్నారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ లీవ్ లను వయోపరిమితి లేకుండా, ఉద్యోగ విరమణ వరకూ వినియోగించుకునే వెసులుబాటు కల్పించామని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తామని, ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తామని, 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తామని కూడా తెలిపారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

