Telangana State Cooperative Bank Staff Assistant Recruitment 2025: నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం ఇది. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు. ఈ ఉద్యోగాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అలాగే, తెలుగు చదవడం, రాయడం రావాలి. వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, 02.10.1995 నుండి 01.10.2007 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక జరుగుతుంది. పరీక్ష ఆంగ్లంలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు సంబంధిత DCCB వెబ్‌సైట్ https://tgcab.bank.in/ కు వెళ్లి, “ONLINE” ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత “క్రొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి” ట్యాబ్‌ను ఎంచుకోవాలి.
దరఖాస్తు ఫీజు: SC/ST/PC/EXSM అభ్యర్థులు ₹500 చెల్లించాలి. జనరల్/BC/EWS అభ్యర్థులు ₹1000 చెల్లించాలి. ఆన్‌లైన్ చెల్లింపు ఛార్జీలు, GST మరియు బ్యాంక్ లావాదేవీ ఛార్జీలు అభ్యర్థి భరించాలి.
ఎంపిక అయిన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతం ఇస్తారు. ఇది పోస్టు బట్టి మారుతుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 18, 2025. చివరి తేదీ: నవంబర్ 6, 2025.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

