Advertisement

బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ కీలక ఆదేశం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనజీవనం అస్తవ్యస్తం కావడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వరద బాధిత ప్రజలకు అండగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

పలు జిల్లాల పార్టీ ముఖ్య నాయకులకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించిన కేసీఆర్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అప్రమత్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల్లో నీట మునిగిన నివాసాలు, దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తమ వంతుగా ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement