ఈ వారం దీపావళి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో “తెలుసు కదా” ఒకటి. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ నిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా, నీరజ కోన దర్శకత్వం వహించారు. కాగా థియేటర్లలో రిలీజ్ అయిన తెలుసు కదా బీలో మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
కథ విషయానికి వస్తే.. చిన్నప్పట్నుంచి అనాధగా పెరిగిన వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటూ తనకంటూ ఓ కుటుంబం ఉండాలని కోరుకుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత తన లైఫ్ లోకి అంజలి శర్మ (రాశిఖన్నా) వస్తుంది. వారిద్దరి ప్రేమ చిగురించి పెళ్లి వరకు వస్తుంది. అయితే వారిలో ఒకరి వల్ల పిల్లలు పుట్టారని తెలుస్తుంది. అప్పుడు వీళ్ళ లైఫ్ లోకి ఎంటరయిన డాక్టర్ రాగ కుమార్ (శ్రీనిధి శెట్టి) వారికి సాయం చేస్తానని చెప్తుంది. మరి వీళ్ళ మధ్య సంబంధం ఎక్కడి వరకు దారి తీసింది. ఫైనల్ గా వీళ్ళ కథ ఎలా ముగిసింది అనేది తెలుసుకోవాలంటే మూవీ మొత్తం చూడాల్సిందే.
సినిమా కథ పరంగా రొటీన్ గా ఉండగా, దర్శకురాలు నీరజ ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాని మలచగలిగింది. అయితే స్క్రీన్ ప్లే పరంగా అంతగా ఆకట్టుకోలేదు. సిద్ధూ తన పెర్ఫార్మన్స్ తో సినిమాని ముందుండి నడిపించాడు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ల గ్లామర్ సినిమాకి కాస్త హెల్ప్ అవ్వచ్చు. తమన్ మ్యూజిక్ ఒకే అనిపించే విధంగా ఉండగా, నిర్మాతలు సినిమాకి బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా “తెలుసు కదా” అని అంటే అంతా తెలిసిందే చెప్పారు, కొత్తగా ఏం లేదన్నట్టు ఉంది.
రేటింగ్ 2.75/5
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
