Advertisement

TG: బీసీ రిజర్వేషన్లపై 14న రాష్ట్ర బంద్: ఆర్.కృష్ణయ్య

Telangana:

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 9 హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్నికలపై, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని బీసీ సంఘం నాయకులు, ఎంపీ ఆర్ కృష్ణ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న అన్ని బీసీ సంఘాలతో కలిసి రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. బంద్‌కు సీఎం రేవంత్‌రెడ్డితో సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక స్టే ఇవ్వడం దుర్మార్గమని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని నిన్న మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం ‘మిలియన్ మార్చ్’ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement