Advertisement

అక్రమ నిర్మాణాలపై డిపిఓ కు వినతి పత్రం అందజేసిన జిల్లా ప్రెస్ క్లబ్ | Kothagudem news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐ డి ఓ సి కార్యాలయంలో నూతన జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్. ఈ సందర్భంగా జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా డిపిఓ రాంబాబును సత్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారి రాంబాబు మాట్లాడుతూ మీడియా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తేవడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు లక్ష్మీదేవి పల్లి అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి తదితర మండలాల్లో గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల ను నిలుపుదల చేయాలని గిరిజన చట్టాలను అతిక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సభ్యులు అందజేశారు. సానుకూలంగా స్పందించిన డిపిఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై తగు చర్యలు తీసుకుంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ లు సుధీర్ కుమార్ భద్రాచలం ప్రభాకర్ కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement