Vivo V60e ఒక స్లీక్, లగ్జరీ డిజైన్ తో రాబోతోంది. గత మోడల్ V50e తో పోలిస్తే ఇది మరింత మెరుగైన లుక్, అల్ట్రా స్లిమ్ బెజెల్స్, క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ తో వస్తోంది. ఫుల్ బాడీ డ్రాప్ ప్రొటెక్షన్, IP68 / IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అవుతుందని వివో కన్ఫర్మ్ చేసింది.
కెమెరా విభాగంలో ఈ ఫోన్ ఒక భారీ సెన్సార్ సెటప్ తో వస్తోంది. వెనుక వైపు 200MP OIS ప్రధాన కెమెరా, 8MP వైడ్ యాంగిల్ కెమెరా జతగా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది వివో V60 సిరీస్ లో 200MP కెమెరా ఉన్న మొట్టమొదటి ఫోన్ గా నిలుస్తుంది.
ఈ కెమెరా సెటప్ తో అల్ట్రా HD ఫోటోలు, 85mm క్లోజప్ ప్రో పోర్ట్రైట్ ఫోటోలు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ తో సూపర్ స్టేబుల్ వీడియోలు, ఫోటోలు అందిస్తుంది. AI ఫెస్టివల్ పోర్ట్రైట్, AI ఇమేజ్ ఎక్స్‌ప్యాండర్ వంటి అదనపు AI ఫీచర్లు కూడా ఉంటాయి.
ప్రాణం ఇచ్చేది బ్యాటరీ. 6500mAh భారీ బ్యాటరీ, 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లాంచ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ, “కమింగ్ సూన్” బ్యానర్ తో టీజింగ్ చేస్తోంది. త్వరలోనే ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ డేట్ లు వెల్లడి కానున్నాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

