BSNL 4G network | ఈ 4G సేవలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడ్డాయి. క్లౌడ్-ఆధారిత నెట్‌వర్క్ కావడంతో భవిష్యత్తులో 5Gకి సులభంగా అప్‌గ్రేడ్ అవుతుంది. సుమారు 98,000 టవర్లలో ఒకేసారి సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ ఒడిశాలోని జార్సుగుడా నుంచి నెట్‌వర్క్‌ను ఆవిష్కరిస్తారు. టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గువాహటిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
“భారత్ ఇప్పుడు టెలికాం ఉత్పత్తిలో ఐదో దేశంగా నిలిచింది” అని సింధియా తెలిపారు. ఇప్పటివరకు డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా మాత్రమే ఈ రంగంలో ఉండేవి. ఈ సందర్భంగా 100% 4G సాచురేషన్ ప్రాజెక్ట్ కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ కింద 29,000–30,000 గ్రామాల్లో 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. BSNL నెట్‌వర్క్ గ్రామీణ, అంతర్గత ప్రాంతాలకు డిజిటల్ సమగ్రత తీసుకురానుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

