Pawan Kalyan fans anger: పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం ( Deputy CM Pawan Kalyan ) కావడంతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని LB స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అకస్మాత్తుగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడికి వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకం. రెండేళ్ల పాటు కష్టపడి తీసిన ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగా జరగకపోవడం అభిమానులను బాగా బాధించింది. ప్రతిరోజూ హైదరాబాద్ లో వర్షం ఉండటం తెలిసినా, ఓపెన్ గ్రౌండ్ లో ఈవెంట్ ఏర్పాటు చేయడం తప్పు అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. శిల్ప కళా వేదిక లాంటి క్లోజ్డ్ ఆడిటోరియం ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి రాకపోయేది.
ఇంకా నిరాశ పెంచే విషయం ఏమిటంటే, థియేట్రికల్ ట్రైలర్ ని ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పి, ఆ తర్వాత సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేస్తామని మార్చారు. కానీ ఈవెంట్ రద్దు కావడంతో ట్రైలర్ కూడా విడుదల కాలేదు. పవన్ కళ్యాణ్ స్టేజిపై ఓ షార్ట్ వీడియో చూపించారు. దాన్ని మొబైల్‌లో రికార్డ్ చేసిన కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. వెంటనే DVV మూవీ టీం కాపీరైట్ స్ట్రైక్ వేసి తొలగించారు. ఇలాంటి పరిస్థితి గత రెండు దశాబ్దాలలో ఎప్పుడూ రాలేదు. మూడు రోజుల్లో సినిమా విడుదల కాబోతున్నా, థియేట్రికల్ ట్రైలర్ లేకపోవడం ప్లానింగ్ లో లోపాలను స్పష్టం చేస్తోంది. ఫ్యాన్స్ AM రత్నం లాంటి పాత కాలపు మేకర్స్ బెటర్ అని ట్విట్టర్ లో మీమ్స్ పెడుతూ DVV టీం పై బూతులు తిడుతున్నారు. కనీసం ప్రెస్ మీట్ అయినా నిర్వహించండి అంటూ బ్రతిమిలాడుతున్నారు.
ఇక శుభవార్త ఏమిటంటే, ఓవర్సీస్ కి సినిమా ఫస్ట్ హాఫ్ కాపీలు ఇప్పటికే వెళ్లిపోయాయి. సెకండ్ హాఫ్ కాపీలు కూడా ఈరోజు సాయంత్రం లోపు వెళ్లిపోతాయి. ట్రైలర్ కూడా ఈరోజు విడుదల కానుంది, కానీ ఖచ్చితమైన సమయం ఇంకా ప్రకటించలేదు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

