జీఎస్టీలో రెండు స్లాబులు మాత్రమే: 5%, 18%
ఇకపై జీఎస్టీ పన్ను విధానం చాలా సరళంగా ఉండబోతోంది. కేంద్రం ప్రకటించిన కొత్త నిర్ణయం ప్రకారం, దేశంలో కేవలం 5% మరియు 18% అనే రెండు పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇది పన్ను వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఇప్పటికే ఉపయోగిస్తున్న 99 నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి.
ఆరోగ్యం, బీమా, ఔషధాలపై భారం తగ్గనుంది
ఈ సంస్కరణల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్, మెడిసిన్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రజలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, కొనుగోలు శక్తి పెరగనుంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా భారత్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. బహుళజాతి సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రజలకు బహుమతిగా జీఎస్టీ మార్పులు?
పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం ఇవ్వడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన బహుమతిగా కూడా ఈ నిర్ణయాన్ని చూస్తున్నారు విశ్లేషకులు.
ఇంకా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
