ఎస్బీఐ ఫౌండేషన్ ( SBI Foundation )పేద కానీ ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025 ( Platinum Jubilee Asha Scholarship 2025 ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందజేయనుంది. తొమ్మిదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కింద విద్యార్థి కోర్సు మరియు స్థాయి బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం పునరుద్ధరణ కోసం కనీస మార్కులు లేదా CGPA పాటించాలి.
అర్హతలు: గత సంవత్సరంలో 75% మార్కులు లేదా 7 CGPA ఉండాలి. SC/ST విద్యార్థులకు 67.5% మార్కులు లేదా 6.30 CGPA తగినది. కుటుంబ వార్షిక ఆదాయం స్కూల్ విద్యార్థులకు రూ.3 లక్షలు, ఇతరులకు రూ.6 లక్షలు మించకూడదు.
ఐఐటీ, ఐఐఎం, వైద్యం, ఓవర్సీస్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ నవంబర్ 15, 2025 వరకు www.sbiashacholarship.co.in లో సమర్పించాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- ఆగస్టు 2026 బ్యాంక్ సెలవుల జాబితా విడుదలైంది
- ఆగస్టు 5 రాశిఫలాలు: గ్రహాల సంచారంతో ఆ రాశుల వారికి ధనలాభాలు
- లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: భారీ గ్యాప్ అప్తో ప్రారంభమయ్యే అవకాశం
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
