మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల వివరాలను సెప్టెంబర్ 15, 2025లోగా బీసీ కమిషన్‌కు అందజేయాలని కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ అధికారులకు సూచించారు.
TELANGANA BC EMPLOYEES NEWS
6 నెలల క్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడంతో ఈ సూచనలు జారీ చేశారు. ఇక ముందు ప్రతి సంవత్సరం మార్చి 31న బీసీ ఉద్యోగుల సమగ్ర సమాచారం కమిషన్‌కు అందించాలని నిర్ణయించారు.
కమిషన్ సేకరించే సమాచారం ఆధారంగా బీసీ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని నిరంజన్ పేర్కొన్నారు.
కొన్ని చిన్న బీసీ కులాలకు అవకాశాలు సరిగా లభించడం లేదని, పెద్ద కులాలే ఎక్కువగా ప్రయోజనాలు పొందుతున్నాయని ఆయన తెలిపారు. దీంతో బీసీ రిజర్వేషన్లు, బీసీ జాబితాను పునర్వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

