Advertisement

AP Smart Ration Card | మీకు ఎప్పుడు వస్తాయి?

AP Smart Ration Card Distribution News

AP కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు! మీకు ఎప్పుడు వస్తాయి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25, 2025 నుండి ప్రారంభించింది. పాత రైస్ కార్డుల స్థానంలో ATM కార్డు పరిమాణంలో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన కార్డులను ఉచితంగా అందిస్తున్నారు.

Advertisement

కార్డుపై ఏముంటుంది?

Advertisement
  • కుటుంబ పెద్ద ఫోటో (ఆధార్ నుండి)
  • రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం
  • QR కోడ్ (పంపిణీ వివరాలు, కార్డు స్థితి, బయోమెట్రిక్ ధృవీకరణ చరిత్ర స్కాన్ చేసి తెలుసుకోవచ్చు)
  • రాజకీయ నాయకుల ఫోటోలు లేవు.

AP smart ration card Distribution Schedule 

  • 1వ దశ (ఆగస్టు 25): విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా.
  • 2వ దశ (ఆగస్టు 30): చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు.
  • 3వ దశ (సెప్టెంబర్ 6): అనంతపురం, అల్లూరి సీతారామరాజు, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి.
  • 4వ దశ (సెప్టెంబర్ 15): బాపట్ల, పల్నాడు, వైయస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం.

AP New smart ration card Process

  • రేషన్ డీలర్ దగ్గర ePOS మెషిన్ ద్వారా బయోమెట్రిక్ లేదా OTP తో కార్డు పొందాలి.
  • తర్వాత గ్రామ సచివాలయ సిబ్బంది GSWS ఉద్యోగుల యాప్ లో “రైస్ కార్డు పంపిణీ న్యూ” ఆప్షన్ లో ధృవీకరించాలి.

AP New ration card QR code features

  • పారదర్శకత, బోగస్ కార్డులపై అంకుశం
  • ప్రతి నెలా సరుకు పంపిణీ ధృవీకరణ
  • ప్రభుత్వం రియల్ టైం పర్యవేక్షణ

తప్పుడు వివరాలు ఉంటే ఏం చేయాలి?

Advertisement
  • ముందుగా సచివాలయంలో వివరాల సవరణకు దరఖాస్తు చేసుకోండి.
  • తహసిల్దార్ ఆమోదం తర్వాత మాత్రమే కొత్త కార్డు అందుతుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement