Advertisement

Airtel Down | ఎయిర్టెల్ నెట్‌వర్క్ సేవలు దేశవ్యాప్తంగా స్తంభించాయి

Advertisement

మన పత్రిక, వెబ్​డెస్క్ : భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఎయిర్టెల్ నెట్‌వర్క్ సేవలు స్తంభించాయి. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ లోని వినియోగదారులు సేవలు లేకుండా ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Airtel network down across india today

టెక్ సమస్యలను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, సాయంత్రం 12:15 సమయంలో సుమారు 7,109 ఫిర్యాదులు నమోదయ్యాయి.

సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఒక గంటలోపు పరిష్కారం అవుతుందని ఎయిర్టెల్ కేర్స్ తెలిపింది. సేవలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఫోన్ రీస్టార్ట్ చేయాలని సూచించింది.

Advertisement

సోషల్ మీడియాలో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “సేవలు ఆగాయా? ఎప్పుడు పునరుద్ధరిస్తారు?” అని ప్రశ్నించారు. కొందరు ట్రాయ్ కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement