సినిమా రంగంలో కాస్మెటిక్ సర్జరీలపై జరుగుతున్న చర్చల మధ్య నటి శ్రుతి హాసన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. నేహా ధూపియా, అంగద్ బేడీల షో ‘డబుల్ డేట్’లో పాల్గొన్న ఆమె, కాస్మెటిక్ మార్పుల విషయంలో దాపరికం లేకుండా నిజాయితీగా ఉండటం ముఖ్యమని వ్యాఖ్యానించారు.
ప్రజల కళ్ల ముందే తాను పెరిగానని, కనిపించే మార్పులను లేదని చెప్పడం సరికాదని శ్రుతి హాసన్ పేర్కొన్నారు. తన రూపంలో వచ్చే మార్పుల గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని, అయితే ఈ సర్జరీలను ఇతరులకు ప్రచారం చేయడానికి లేదా ప్రోత్సహించడానికి తాను ఇష్టపడనని చెప్పారు. కాస్మెటిక్ విధానాలు అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ఆమె అభిప్రాయపడ్డారు.
మద్యపాన అలవాటు, కొత్త ప్రాజెక్టుల వివరాలు
ఈ కార్యక్రమంలో కాస్మెటిక్ సర్జరీలతో పాటు తన వ్యక్తిగత అలవాట్ల గురించి కూడా శ్రుతి మాట్లాడారు. ఎనిమిదేళ్ల పాటు మద్యానికి దూరంగా ఉన్న తర్వాత మళ్లీ తాగడం ప్రారంభించానని, ఇప్పుడు తన అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని వివరించారు.
ప్రస్తుతం శ్రుతి హాసన్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే, పవన్ సాధినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
