Advertisement

ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా పుకార్లకు చెక్ పెట్టిన ఫోటో

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రంపై వస్తున్న పుకార్లకు నిర్మాత నాగవంశీ చెక్ పెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థల నుంచి బయటకు వెళ్తున్నారని, నిర్మాతలు చినబాబు మరియు నాగవంశీతో విభేదాలు వచ్చాయంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది.

ఈ వార్తల నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, నిర్మాత నాగవంశీ ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఒక ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో చినబాబు, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ఫోటో వైరల్ కావడంతో సినిమా పనులు అనుకున్నట్టే ముందుకు సాగుతున్నాయని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement