Advertisement

ఆకాశంలో ఒక తార ఈవెంట్‌కు అల్లు అర్జున్

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నవంబర్ 15న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.

నవంబర్ 20న థియేటర్లలో విడుదల

పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక భావోద్వేగ డ్రామాగా తెరకెక్కుతోంది. వ్యోమగామి కావాలని కలలుగనే ఒక గ్రామీణ యువతి ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతుండగా, శృతి హాసన్, రుహానీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా మరియు లైట్‌బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆకాశంలో ఒక తార చిత్రం నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement