దేశవ్యాప్తంగా 2026 నవంబరు 12 గురువారం నాడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు ₹1.39 లక్షలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు ₹1.28 లక్షలు, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు ₹1.04 లక్షల వద్ద ఉంది. అలాగే వెండి ధర చాలా నగరాల్లో కేజీకి ₹2.00 లక్షలుగా నమోదు అయింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు
హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పుణే నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,39,800గా ఉంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర ₹1,28,150 వద్ద ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹1,04,850గా నమోదైంది. చెన్నైలో మాత్రం 18 క్యారెట్ల పసిడి ధర ₹1,04,900గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ₹1,39,950, 22 క్యారెట్ల బంగారం ₹1,28,350 మరియు 18 క్యారెట్ల బంగారం ₹1,05,000 వద్ద ట్రేడ్ అయింది. వడోదర, అహ్మదాబాద్‌లలో 24 క్యారెట్ల బంగారం ₹1,39,850, 22 క్యారెట్ల బంగారం ₹1,28,200 మరియు 18 క్యారెట్ల బంగారం ₹1,04,900గా ఉంది.
వెండి ధరల పరిస్థితి
హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణే, వడోదర, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలు అన్నింట్లోనూ వెండి ధర ఒకే రీతిలో కిలోకు ₹2,00,000గా ఉంది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
