Advertisement

రామాయణ కోసం రోజూ 4 గంటలు మేకప్ వేసుకున్న రాకుల్

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో శూర్పణఖ పాత్ర కోసం తాను రోజూ నాలుగు గంటల పాటు మేకప్, హెయిర్, కాస్ట్యూమ్స్ కోసం కేటాయించినట్లు నటి రాకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని పంచుకుంటూ, తన లుక్ వెనుక మేకప్ ఆర్టిస్టులు, హెయిర్‌స్టైలిస్టులు మరియు కాస్ట్యూమ్ డిజైనర్ల కష్టం ఎంతో ఉందని ఆమె తెలిపింది.

భారతీయ సంస్కృతిలో భాగమైన రామాయణాన్ని భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకురావడంలో భాగమవ్వడం ఒక ప్రత్యేకమైన అనుభవమని రాకుల్ పేర్కొంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీలకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రాకుల్ శూర్పణఖ పాత్రలో కనిపించనుంది.

Advertisement
Advertisement