తమిళనాడులో కొత్త సినిమాలు విడుదలయ్యే మొదటి వారంలో థియేటర్లలో రోజుకు ఆరు షోల వరకు ప్రదర్శించుకునేందుకు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. సవరించిన నిబంధనల ప్రకారం థియేటర్లు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన 2:30 గంటల మధ్య ఈ షోలను నిర్వహించవచ్చు. పెద్ద బడ్జెట్ చిత్రాలకు, భారీ అంచనాలున్న సినిమాలకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుందని భావిస్తున్నారు.
గత నిబంధనల్లో మార్పులు
గతంలో అజిత్ కుమార్ నటించిన ‘తుణివు’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత ప్రత్యేక షోలపై ఆంక్షలు విధించారు. ఆ సమయంలో రోజుకు కేవలం నాలుగు షోలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఆ ఆంక్షలను సడలించి, సినిమా విడుదలైన మొదటి ఏడు రోజుల్లో రోజుకు ఆరు షోల వరకు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
దీపావళి సినిమాలకు ప్రయోజనం
ఈ సడలింపులతో రాబోయే దీపావళి సీజన్లలో విడుదలయ్యే సినిమాలకు మంచి అవకాశం లభించనుంది. సూర్య నటించిన ‘సీన్’, నయనతార నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’, అలాగే ‘రామాయణ’ వంటి చిత్రాలు ఈ నిర్ణయంతో లబ్ధి పొందుతాయని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల థియేటర్లలో టికెట్ల విక్రయాలు పెరిగి, తమిళ సినీ రంగానికి మేలు జరుగుతుందని నిర్మాతలు మరియు పరిశ్రమ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
