Advertisement

పండంటి ఆడబిడ్డకు తండ్రైన దర్శకుడు అభిషాన్ జీవింత్

తమిళ సినిమా దర్శకుడు, నటుడు అభిషాన్ జీవింత్ తండ్రయ్యారు. ఆయన భార్య అఖిల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అభిషాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన అభిషాన్, గతేడాది వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత విత్ లవ్ చిత్రంలో కథానాయకుడిగా కనిపించారు.

Advertisement

అభిమానులు, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

గతేడాది అక్టోబర్ 31న అభిషాన్ తన చిన్ననాటి స్నేహితురాలు అఖిలను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన సరిగ్గా ఏడాదికి ఈ దంపతులకు ఆడపిల్ల జన్మించడంతో అభిమానులు, సినీ రంగ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement