Advertisement

హర్షవర్ధన్ రాణే కొత్త చిత్రం ‘శిలా’ విడుదల తేదీ ఖరారు

నటుడు హర్షవర్ధన్ రాణే కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘శిలా’ విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను 2027 ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

కాశ్మీర్, వియత్నాం నేపథ్యం

ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే సరసన సాదియా ఖతీబ్ కథానాయికగా నటిస్తోంది. ప్రేమ, సస్పెన్స్, అడ్వెంచర్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కథలో విరాట్ అనే పాత్రలో హర్షవర్ధన్ కనిపించనున్నారు. తను ప్రేమించిన వ్యక్తి కోసం సాగించే అన్వేషణ, ఆ క్రమంలో ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితులు, ఉత్కంఠభరిత పోరాటాల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. కాశ్మీర్, వియత్నాం అందమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు.

Advertisement
Advertisement