Advertisement

ఫౌజీ టీజర్‌లో సుభాష్ చంద్రబోస్‌గా మరాఠీ నటుడు సుబోధ్ భావే

ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్ర గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో మరాఠీ ప్రముఖ నటుడు సుబోధ్ భావే నటించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో ఉన్న ఈ వీడియోలో సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ పాత్రల మధ్య సంభాషణను చూపించారు. ఈ పాత్రలలో ఏఐ సాంకేతికత వాడారనే ప్రచారం జరిగినప్పటికీ, నిజమైన నటులే వాటిని పోషించారని స్పష్టమైంది.

మరాఠీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా సుబోధ్ భావే గుర్తింపు పొందారు. గతంలో 2015 లో వచ్చిన ‘లోక్‌మాన్య: ఏక్ యుగపురుష్’ చిత్రంలో బాలగంగాధర్ తిలక్ పాత్రను కూడా ఆయన పోషించారు. ఫౌజీ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప విప్లవ వీరుడి పాత్రలో నటించడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నట్లు సుబోధ్ భావే సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Advertisement
Advertisement