Advertisement

నవంబరులో అనిరుధ్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్

ప్రసిద్ధ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ 2026 నవంబరు 21న చెన్నైలో జరగనుంది. ఈ మేరకు సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ అక్టోబరు 16న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి, రిసెప్షన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు.

అధికారిక ఆహ్వానం, వివరాలు

ముఖ్యమంత్రికి అందించిన ఆహ్వానం గురించి తెలంగాణ సీఎంవో వివరాలను వెల్లడించింది. అయితే నవంబరు 11న గ్రీస్‌లో వీరి వివాహం జరగవచ్చని ప్రచారం సాగుతున్నప్పటికీ, పెళ్లి తేదీ లేదా వేదికపై అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చెన్నైలో జరిగే రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు మాత్రమే ఖరారయ్యాయి.

Advertisement
Advertisement