Advertisement

హైదరాబాద్‌లో ‘రామాయణ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణ’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను 2026 అక్టోబర్ 19న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు రణ్‌బీర్ కపూర్‌తో పాటు యష్, సాయి పల్లవి, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రవి దూబే హాజరవుతారని భావిస్తున్నారు. దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అక్టోబర్ 20 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. ఇటీవల బెంగళూరులో విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఈ రామాయణ మొదటి భాగాన్ని 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నామని, అక్టోబర్ 20 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని నిర్మాతలు వెల్లడించారు.

Advertisement
Advertisement