Advertisement

నాగర్‌కర్నూల్: నిండు గర్భిణీ భార్యను హత్య చేసిన భర్త

వివాహమై ఏడాది కూడా పూర్తికాకముందే ఓ నిండు గర్భిణీ ప్రాణం బలయింది. మద్యం మత్తులో భర్త జరిపిన అఘాయిత్యంతో అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వెంకటేష్, నారాయణమ్మ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, రెండో కుమార్తె శివాణికి ఏడాది క్రితం అదే జిల్లాకు చెందిన పరుశురాంతో వివాహం జరిగింది. పరుశురాం ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన పరుశురాం భార్య శివాణితో గొడవపడ్డాడు. అర్ధరాత్రి సమయంలో విచక్షణ కోల్పోయిన అతను, నిండు గర్భిణీ అని కూడా చూడకుండా ఆమె గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు.

Advertisement

ఈ హత్యను ప్రమాదంగా నమ్మించేందుకు బాత్రూంలో జారిపడి చనిపోయిందని కుటుంబ సభ్యులకు నమ్మబలికాడు. అయితే శివాణి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు భర్త పరుశురాంను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు కలచివేసింది.

Advertisement