Advertisement

బస్సు ప్రమాదం.. క్లీనర్ మృతి, 24 మందికి గాయాలు

CRIME: చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ‘జగన్ ట్రావెల్స్’కు చెందిన ప్రైవేట్ బస్సు యండపల్లి వద్ద నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్లీనర్ వైపున ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గాయపడిన 24 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో ఏపీలో రాత్రివేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమవ్వడం, ప్రమాదాలకు గురికావడం వంటి ఘటనలు పెరిగిపోవడంతో రాత్రివేళ ప్రయాణాలంటేనే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement
Advertisement