Advertisement

వర్ష సూచన.. 18 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని స్పష్టం చేసింది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏపీలో అల్పపీడనం కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాలో అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. అక్కడ గంటకు 50 నుంచి 60 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Advertisement