Advertisement

ఫేక్ అకౌంట్‌తో సీఎం డ్రామాలు: మాజీ మంత్రి హరీష్

TG POLITICS: కాంగ్రెస్ నడిపే ఫేక్ అకౌంట్‌ ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే ఆ ఫేక్ అకౌంట్‌లో పోస్టులు చేస్తూ, దాన్నే పట్టుకుని సీఎం సభను తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు.

ఆ దొంగ ఫేక్ అకౌంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫేక్ అకౌంట్‌ ఆధారంగా శాసనసభను తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు, సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసులు కూడా ఇస్తామని వెల్లడించారు.

Advertisement
Advertisement