Advertisement

అహ్మదాబాద్: కూతురి దారుణ హత్య.. తండ్రి, అన్నయ్య అరెస్టు

CRIME: కూతురి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందనే నెపంతో, పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రి, అన్న కలసి ఒక యువతిని దారుణంగా కొట్టి చంపిన సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. సర్ఖేజ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి ఒక అబ్బాయితో సన్నిహితంగా ఉన్న వీడియో మూడు నెలల క్రితం నెట్టింట్లో వైరల్ అయింది. ఇది చూసిన తండ్రి మహమ్మద్ ఫరూక్ తీవ్ర అవమానంగా భావించాడు. కుటుంబ గౌరవానికి భంగం కలిగించిందని భావించి కొడుకు హాబీల్ ఫరూక్ (38)తో కలసి ఆమెను హతమార్చడానికి ప్లాన్ చేశాడు. యువతిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సుత్తితో దారుణంగా బాది హత్య చేశారు. అనంతరం దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమెపై దాడి జరిగినట్లు తేలడంతో అనుమానంతో తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని విచారించగా, పరువు కోసమే తాము హత్య చేసినట్లు నేరం అంగీకరించారు.

Advertisement
Advertisement