Advertisement

మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు

మన పత్రిక: దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పైకి కదిలాయి. 2026 ఆగస్టు 24న వివిధ నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి రేట్లు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకినట్లు తాజా వివరాలు తెలుపుతున్నాయి. జాతీయ స్థాయి సూచిక ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,63,080 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర ₹1,49,490 వద్ద నమోదైంది.

హైదరాబాద్‌ మార్కెట్‌లో పసిడి ధరలు జాతీయ సగటు కంటే స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. గుడ్‌రిటర్న్స్ సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹880, 22 క్యారెట్ల పసిడిపై ₹800 పెరిగాయి. దీంతో అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,63,970 కి, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,50,300 కి చేరింది. విజయవాడ, చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణే నగరాల్లోనూ 24 క్యారెట్ల బంగారం ₹1,63,970 వద్ద, 22 క్యారెట్ల పసిడి ₹1,50,300 వద్దే విక్రయమవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ₹1,64,120 కాగా, 22 క్యారెట్ల ధర ₹1,50,450 గా ఉంది.

Advertisement

మరోవైపు వెండి రేట్లు కూడా పెరిగిన స్థాయిలోనే కొనసాగుతున్నాయి. జాతీయ స్థాయిలో కిలో వెండి ధర ₹2,60,000 వద్ద ఉండగా, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, తిరుపతి నగరాల్లో కిలో వెండి రేటు ₹2,75,000 కు చేరింది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణేలలో కిలో వెండి ₹2,60,000 గాను, ఢిల్లీలో ₹2,60,900 గాను నమోదు నమోదైంది.

Advertisement