Advertisement

హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండతో కలసి కనిపించిన రష్మిక

మన పత్రిక, హైదరాబాద్: నటి రష్మిక మందన్న ఇటీవల హైదరాబాద్‌లో నటుడు విజయ్ దేవరకొండతో కలిసి ఒక నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఉంటి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆమె, నిర్మాత నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో, ఆమె ఆరోగ్యంగా కనిపించడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్రంలో రష్మిక గోండ్ తెగకు చెందిన మహిళగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణ సమయంలో ఆమెకు గాయమైంది. దీంతో ఆమెను దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘రణబలి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదట సెప్టెంబర్ 11న విడుదల కావలసి ఉండగా, రష్మిక గాయపడటంతో విడుదల తేదీని అక్టోబర్ 30కి వాయిదా వేసినట్లు సమాచారం. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె తిరిగి చిత్రీకరణలో పాల్గొననున్నారు.

Advertisement