Advertisement

కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కొత్త సినిమా షూటింగ్ పునఃప్రారంభం

మన పత్రిక: బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కలసి నటిస్తున్న సరికొత్త ప్రేమకథా చిత్ర షూటింగ్ పునఃప్రారంభమైంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా చిత్రీకరణ, ప్రస్తుతం ముంబైలో మళ్లీ మొదలైంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

ఈ రోమాంటిక్ డ్రామాలో సంగీతానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండనుంది. ముంబైలో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేసేందుకు నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర శీర్షిక, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

బాలీవుడ్ అరంగేట్రం

ఈ సినిమా కోసం ‘తూ మేరీ జిందగీ హై’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంగీత ప్రాధాన్యం ఉన్న ఈ కథకు ఆ శీర్షిక సరిపోతుందని భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో నటిగా గుర్తింపు పొందిన శ్రీలీలకు ఇది హిందీ చిత్రసీమలో తొలి సినిమా కావడం విశేషం. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కాంబినేషన్‌తో పాటు అనురాగ్ బసు దర్శకత్వం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.

Advertisement