Advertisement

ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సూర్య ‘విశ్వనాథ్ అండ్

మన పత్రిక: సూర్య కథానాయకుడిగా నటించిన కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్ల మార్కును దాటింది. బాక్సాఫీస్ వద్ద సానుకూల స్పందన రావడంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు విశేషంగా తరలివస్తున్నారు. ఆదివారం ముగిసే సమయానికి నమోదైన నివేదికల ప్రకారం ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో విడుదలైంది. తొలి వీకెండ్‌లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడంతో, బ్రేక్ ఈవెన్ లక్ష్యంలో దాదాపు సగాన్ని సాధించినట్లయింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో భావోద్వేగాలు, కుటుంబ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన పాత్రల్లో సూర్య, మమితా బైజుల నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది.

Advertisement

ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం కూడా ఈ సినిమా వసూళ్లకు కలసివచ్చే అంశంగా మారింది. అయితే, సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారపు రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను నిలబెట్టుకుంటుందనే దానిపైనే రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్య సాధన ఆధారపడి ఉంటుంది.

Advertisement