మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అధికారుల అంచనా. నేడు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు.
గత వర్షపాతం వివరాలు
రాష్ట్రంలో నిన్న అనేక జిల్లాల్లో వర్షాలు కురిసాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో అత్యధికంగా 708 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేస్తూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
