Advertisement

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదు

మన పత్రిక, హైదరాబాద్: విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడిన విజయవాడకు చెందిన దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. బేగంపేటలో ఫ్లయింగ్ బోర్డర్ కన్సల్టెన్సీ పేరుతో కార్యకలాపాలు సాగించిన ఈ Vijayawada Couple, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒకరి వద్ద నుంచి రూ.14 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దంపతులు దాదాపు 750 మంది బాధితుల నుంచి సుమారు రూ.12 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసం ద్వారా వచ్చిన ఈ డబ్బును వీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్లు బయటపడింది. గతంలో ఈ తరహా కేసులోనే విజయవాడలో అరెస్ట్ అయిన ఈ జంట, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారని సమాచారం.

Advertisement
Advertisement