Advertisement

హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు

మన పత్రిక, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు, ఎమ్మెల్యే Balakrishna ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్లి పరామర్శించారు. అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న తన బావమరిది బాలకృష్ణను చూసిన సీఎం, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

గత వారం ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో బాలకృష్ణ మోకాలికి గాయమైంది. దీంతో ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి మోకాలి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనే విషయాన్ని వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు.

Advertisement
Advertisement