Advertisement

ఆగస్టు 17 నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు ప్రారంభం

మన పత్రిక: భోగాపురం ఎయిర్‌పోర్ట్ (Bhogapuram Airport) నుంచి ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం జరగనుందని పల్లా శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. ప్రధాని పాల్గొనే ఈ బహిరంగ సభకు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సుమారు రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement