Advertisement

శాప్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

మన పత్రిక: ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 60 ఏళ్లుగా ఉన్న శాప్ సిబ్బంది రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు వర్తింపజేస్తున్న నిబంధనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. వయోపరిమితి పెంపు నిర్ణయంతో ఇప్పటికే రిటైరైన ఎనిమిది మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. అయితే వీరు విధుల్లో లేని కాలానికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించరని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement