Advertisement

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై గృహ హింస కేసు నమోదు

మన పత్రిక: మాజీ మంత్రి Jogi Ramesh కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కేసు నమోదైంది. జోగి రమేశ్ కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణలతో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

బాధితురాలు మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన కుమారుడు సహా మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement