మన పత్రిక: జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలకు విద్యార్థులు దూరంగా ఉండాలని దిల్లీ యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ నాయకుడు Rahul Gandhi ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించే ధైర్యం ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తగిన సమయం వచ్చినప్పుడు ఈ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జంతర్ మంతర్ వద్ద చట్టవిరుద్ధంగా గుమిగూడడం లేదా ప్రదర్శనలు చేయడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని దిల్లీ వర్సిటీ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటువంటి కార్యకలాపాలు విద్యార్థుల భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. అందుకే విద్యార్థులు నిరసనలకు దూరంగా ఉండాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది.
రాజకీయ కాక రేపుతున్న నిరసనలు
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 20 నుంచి దిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం జారీ చేసిన అడ్వైజరీపై రాహుల్ గాంధీ స్పందిస్తూ విద్యార్థుల హక్కులను కాలరాయవద్దని పేర్కొన్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- జంతర్ మంతర్ లో నీట్ పేపర్ లీక్ నిరసనలకు పెరుగుతున్న పెద్దల మద్దతు
- విద్యార్థులకు మార్కులు తగ్గితే లోకేశ్‌కే తగ్గినట్లు: చంద్రబాబు
- బెల్లంపల్లి గురుకులంలో విషాహారం ఘటనపై స్పందించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్
- ఈపీఎఫ్ ఖాతాల్లోకి 8.25 శాతం వడ్డీ జమ ప్రారంభం
- మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
