Advertisement

తెలంగాణ బంద్ పిలుపుతో హైదరాబాద్‌లోని పాఠశాలలకు నేడు సెలవు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో జులై 24 శుక్రవారం రోజున హైదరాబాద్‌లోని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో Hyderabad Schools విద్యార్థులకు ముందు జాగ్రత్తగా సెలవు ఇస్తున్నట్లు అర్ధరాత్రి వేళ వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించాయి. ఈ బంద్ కారణంతో పాఠశాలల్లో జరుగుతున్న పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు బడుల యాజమాన్యాలు తెలిపాయి.

విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

ఢిల్లీలో విద్యార్థులపై ప్రయోగించిన బలప్రయోగానికి నిరసనగా, అలాగే కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ సహా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఈ బంద్ నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి మీడియాకు తెలిపారు.

Advertisement
Advertisement